సొంతగూటికి చేరిన కడప కార్పొరేటర్‌ పీటర్‌

వైయస్‌ వివేకానందరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
వైయస్‌ఆర్‌ జిల్లా: అభివృద్ధి అని భ్రమపడిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున గెలిచిన 8 మంది కడప కార్పొరేషన్‌ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. తీరా అక్కడ జరుగుతున్న అవినీతి చూసి తట్టుకోలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆరు నెలల క్రితం కడప నగరానికి చెందిన 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. పచ్చదళం అసలు రంగు తెలుసుకున్న ఆరుగురు కార్పొరేటర్లు ఇటీవల వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. తాజాగా కడప 23వ కార్పొరేటర్‌ పీటర్‌ వైయస్‌ వివేకానందరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి గెలుపునకు కృషి చేస్తానని పీటర్‌ వెల్లడించారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాకు దేవుడితో సమానమని చెప్పారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. నీతి నియమాలకు, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా వైయస్‌ఆర్‌ జిల్లాను నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో మా పార్టీ నాయకులంతా కూడా సొంత పార్టీలోకి వస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top