పోరాట యోధుడు పేర్ని కృష్ణ‌మూర్తి

కోనేరు సెంట‌ర్ (మంగ‌ళ‌గిరి)

పేద, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు తోడుగా ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసిన పోరాట యోధుడు మాజీ మంత్రి పేర్ని కృష్ణ‌మూర్తి అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పేర్నినాని అన్నారు. సోమ‌వారం కృష్ణ‌మూర్తి  19వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న  అభిమానులు కృష్ణ‌మూర్తి విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో గొప్ప నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్న ఆయన కుమారుడిగా జన్మించటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన కృష్ణమూర్తి ఆశయం గొప్పదన్నారు. జిల్లా అధికార ప్రతినిది మాదివాడ రాము మాట్లాడుతూ నాయకునిగా నిరు పేదలకు ఎలాంటి సేవలు చేయాలనే విషయంలో ప్రతి ఒక్కరూ పేర్ని కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ ఉపప్రతిపక్ష నాయకుడు శీలం మారుతీరావు, జోగి చిరంజీవి, లంకా సూరిబాబు తదితరులు మాట్లాడుతూ తీర గ్రామాల అభివృద్ధి, తాగునీటి వసతి కల్పన, నిరుద్యోగులకు ఉపాధి అవకాల కల్పన ఆయనకే సాధ్యపడిందన్నారు

తాజా ఫోటోలు

Back to Top