సీబీఎస్ఈ స్కూళ్లకు అనుమతి

హైదరాబాద్: వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి  ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో తన వాణిని వినిపిస్తున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఎస్‌ఈ స్కూళ్ల అనుమతి విషయమై వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాలకు 2016-17 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 42 సెకండరీ పాఠశాలలకు సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్) అనుమతిని ఇచ్చిందని  కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు.  ఏపీలో 31, తెలంగాణలో11 స్కూళ్లకు అఫిలియేషన్ అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top