పెరిగిన కరెంటు ఇక్కట్లు

అనుముల(నాగార్జునసాగర్) 14ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల గురువారం సాయంత్రం రచ్చబండ నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల గ్రామంలో ఆమెకు మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బంది పెడుతోందని శ్రీమతి షర్మిల ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహానేత ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు కరెంటు కష్టాలు లేవనీ ఆమె చెప్పారు. కొన్నాళ్ళలో జగనన్న ముఖ్యమంత్రి అవుతారనీ, రాజన్న రాజ్యం ఆవిష్కృతమవుతుందనీ శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. డాక్టర్ వైయస్ఆర్ హయాంలో రైతులకు ఏడు గంటల కరెంటు అందిందన్నారు. రాజన్న రాజ్యంలో రైతులకు తొమ్మిది గంటల కరెంటు అందుతుందని శ్రీమతి షర్మిల తెలిపారు. పెరిగిన కరెంటు బిల్లులు తగ్గుతాయన్నారు. మహిళలు , రైతులకు వడ్డీలేని రుణాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు చెబుతున్న సమస్యలు వింటుంటే వారిప్టల ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నదీ అర్థమవుతోందన్నారు.

Back to Top