అవినీతిపై విచారణ చేపట్టాలి

చిత్తూరు: బైరెడ్డిపల్లె పీఏసీఎస్‌లో చోటు చేసుకున్న అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బైరెడ్డిపల్లె మండల కన్వీనర్‌ ఆర్‌.కేశువులు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. పీఏసీఎస్‌లో సుమారుగా రూ. కోటి వరకు అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తుందన్నారు. రైతుల సొమ్మును కాజేసిన దోషులను కోర్టులో ముద్దాయిలుగా నిలబెట్టాలని డిమాండ్‌ చేశారు. వేరుశనగ కాయలు మండలానికి రాకుండానే బయట మిల్లులకు విక్రయించడంపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రోద్బలంతోనే అవినీతి చోటుచేసుకుందన్నారు. ఇప్పుడు అవినీతికి పాల్పడిన వారు తప్పించుకొన్నా తమ పార్టీ అధికారం లోకి రాగేనే విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడేలా చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top