4న పేరాడ తిల‌క్ పాద‌యాత్ర

కోటబొమ్మాళిః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ప్ర‌జా సంక‌ల్పం యాత్ర‌కు మద్దతుగా ఈ నెల 4వ తేదీన టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌క‌ర్త పేరాడ తిలక్‌ నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కోటబొమ్మాళి పార్టీ మండల కన్వీన‌ర్‌ ఎస్‌.హేమసుందరరాజు, కాళ్ళ సంజీవరావు, బోయిన నాగేశ్వరరావు తదితరులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు గురువారం విలేకర్లుతో మాట్లాడారు. 4వ తేదీన టెక్కలి నుంచి మొదలైన తిలక్‌ పాదయాత్ర రావివలస, దండుగోపాలపురంవరకు కొనసాగిస్తు అక్కడ పార్టీ జెండా ఎగరవేస్తారని, అలాగే వడ్డితాండ్ర వద్ద పవర్‌ప్లాంట్‌ నిర్వహాస్తును పరామర్శిస్తారని , సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి జంక్షన్‌ మీదుగా వచ్చి భోజ‌న విరామం అనంతరం కొత్తపేట వరకు పాద యాత్ర కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. 
పాదయాత్రను విజ‌య‌వంతం చేద్దాం
సంతబొమ్మాళి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ప్ర‌జా సంక‌ల్పం యాత్ర‌కు మద్దతుగా ఈ నెల 4వ తేదీన టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌క‌ర్త పేరాడ తిలక్‌ నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం  చేయాల‌ని  మండల పార్టీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి కోరారు. గురువారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పై ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పాలన పై వైయ‌స్ జ‌గ‌న్‌ చేపడుతున్న యాత్ర ఆదర్శమైనదని అన్నారు. దానికి సంఘీభావంగా తిలక్‌ చేపడుతున్న పాదయాత్రను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు
Back to Top