ఇది ప్రజల విజయంః రోజా

హైదరాబాద్ః  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈవిజయం నాది మాత్రమే కాదు నియోజకవర్గ ప్రజలదని రోజా చెప్పారు. తన ప్రజలకు న్యాయం చేయడం కోసం తన హక్కులను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లడం జరిగిందని రోజా చెప్పారు. సభకు వెళ్లేందుకు అనుమతిచ్చినందుకు న్యాయస్థానానికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానాల మీద తనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నానని రోజా స్పష్టం చేశారు. ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.  తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రజల తరపున పోరాడుతూనే ఉన్నానని రోజా చెప్పారు. ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా న్యాయం కోసం పోరాడుతానన్నారు. సభకు వెళ్లి అన్నింటిపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.

Back to Top