- స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలు- దారి పొడువునా సమస్యలే- అందరికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నవైయస్ జగన్ కర్నూలు : ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటికి 20 రోజులు పూర్తి కాగా, బుధవారం 21వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో కొనసాగుతోంది. ఈ యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, యువకులు, చివరకు చిన్న పిల్లలు సైతం జననేత పాదయాత్రకు మద్దతుగా నిలుస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. ఇవాళ ఉదయం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పలువురు కలిసి పాదయాత్రకు మద్దతు తెలిపారు.
ఎంఆర్‌పీఎస్ నాయకుల మద్దతువైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్‌పీఎస్) నాయకులు మద్దతు తెలిపారు. గోనెగండ్ల మండలంలో ఆ సంఘం నాయకులు ప్రతిపక్ష నేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని, తాను పెద్ద మాదిగను అవుతానని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. మీరే మాకు అండగా ఉండాలని వైయస్ జగన్‌కు కోరారు.
టీచర్ల హర్షంఅధికారంలోకి రాగానే సీపీఎస్ విధానం రద్దు చేస్తామని పాదయాత్ర ప్రారంభ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంతో గోనెగండ్ల మండలంలోని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం టీచర్లు వైయస్ జగన్‌ను కలిశారు. తమ మద్దతు మీకే అంటూ పాదయాత్రలో జననేతతో కలిసి కొంత దూరం నడిచారు.
జగనన్నకు తోడుగా..ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తోడుగా పార్టీ నేతలు పలువురు పాదయాత్రలో అడుగులు కలుపుతున్నారు. ఇవాళ ఉదయం కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, బావకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నాయకులతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త జగన్‌మోహన్‌రెడ్డి, మురళికృష్ణ తదితరుల పాదయాత్రలో పాల్గొన్నారు.
సమస్యలు సావధానంగా వింటూ..పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్డు వెంట ప్రజల సమస్యలు సావధానంగా వింటూ ముందుకు సాగుతున్నారు. తనను కలిసిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏడాది పాటు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం (వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ) అధికారంలోకి వస్తుంది. అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా’ అని వైయస్ జగన్ మోహన్‌రెడ్డి తనను కలిసిన మహిళలు, రైతులకు హామీ ఇస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని వైయస్ జగన్‌భరోసా ఇచ్చారు.