తాగునీటికి కటకట


కృష్ణా జిల్లా: తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పలువురు రైతులు, మహిళలు వైయస్‌. జగన్‌ను కలిసి నీటి సమస్యను వివరించారు. తాగడానికి కనీసం నీరు దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రతి కుటుంబం నీరు కొని తాగాల్సి న దుస్థితి నెలకొందన్నారు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.  సరైన రేటు లేక అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆక్వారైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారని వివరించారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొల్లేరులో రెగ్యులేటర్‌ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వారి సమస్యలు సావధానంగా విన్న జననేత వైయస్‌జగన్‌ వారికి భరోసా కల్పించారు. 
 
Back to Top