బాబు వచ్చారు..ఆయన కుమారుడికే జాబొచ్చింది..

విజయనగరంః దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందని విజయనగరం వాసులు అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని ఆయన కుమారుడికి మాత్రమే జాబు వచ్చిందన్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో సుమారు 50 వేల డిఎస్సీ పోస్టులను భర్తీ చేశారని, నేడు కనీసం 20 వేల పోస్టులు భర్తీ చేయలేకపోతున్నారని విమర్శించారు. గతంలో వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలనే ఇప్పడు టీడీపీ అమలు చేస్తుందన్నారు. వాటిలో కొన్నింటిని నిర్వీర్యం చేసి ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ రాకతో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Back to Top