చంద్రబాబు పేద ప్రజలను నట్టేట ముంచాడు



నేలకోటతండా మహిళలకు వైయస్‌ జగన్‌ భరోసా
అనంతపురం: ఆచరణకు సాధ్యపడని హామీలనిచ్చి చంద్రబాబు పేద, మధ్యతరగతి ప్రజలను నట్టేట ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా నేలకోటతండా చేరుకున్న జననేత అక్కడ వైయస్‌ఆర్‌ సీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం మహిళలతో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలంతా వారి సమస్యలకు జననేతతో చెప్పుకున్నారు. అనంతరం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత సమస్యలన్నీ పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ప్రతి తల్లి పిల్లలను బడికి పంపించాలని, చిట్టి చిన్నారులను బడికి పంపిస్తే ప్రతీ తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. బడికి వెళ్లి చదువుకుని పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే పేదరికం మటుమాయం అవుతుందన్నారు. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో అక్షరాస్యత కూడా పెరుగుతుందన్నారు. 

అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్సన్‌కు అర్హులైన అవ్వాతాతలకు రూ. 2 వేలు ఇస్తామని, పెన్షన్‌ వయస్సు 45కు తగ్గిస్తామన్నారు. అంతే కాకుండా పొదుపు సంఘాల రుణాల మాఫీకి నాలుగు దఫాలుగా మహిళల చేతికే డబ్బులు ఇస్తామన్నారు. అందరికీ సున్నావడ్డీలకు రుణాలు ఇచ్చి అండగా ఉంటానన్నారు. చంద్రబాబు పాలనలో సున్నావడ్డీలు లేవు. ఎందుకంటే ప్రభుత్వం బ్యాంక్‌లకు వడ్డీలు కడితేనే బ్యాంక్‌ వారు మనకు సున్నావడ్డీకి రుణాలు ఇస్తారు. కానీ చంద్రబాబు కట్టకపోవడంతో బ్యాంక్‌లు రూ. 2 వసూలు చేస్తున్నాయన్నారు. 

తాజా వీడియోలు

Back to Top