మ‌ద్ద‌తు వెల్లువ‌


- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ర‌ష్యా, క‌జ‌కిస్థాన్ దేశ‌స్తులు
- స‌మ‌స్య‌లు చెప్పుకున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు, అన్న‌దాత‌లు
అనంత‌పురం:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 40వ రోజుకు చేరింది. జ‌న‌నేత పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. అనంత‌పురం జిల్లాలో సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో బుధ‌వారం ఆర్డీటీ స్వ‌చ్ఛంద సంస్థ డైరెక్ట‌ర్ మంచు పెర్ర‌ర్‌, విదేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు పాల్గొని వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ర‌ష్యా, క‌జ‌కిస్థాన్ దేశ‌స్థులు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. పాద‌యాత్రగా త‌మ గ్రామానికి వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

రైతుల‌కు భ‌రోసా..
40వ రోజు ప్రజాసంకల్పయాత్రలో రైతుల దగ్గర నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వరకూ రాజన్న తనయుడిని కలిసి తన సమస్యలను విన్నవించుకుంటున్నారు.  దారి పొడువునా పలువురు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రెడ్డిపల్లిలో వైయ‌స్ జగన్‌ను రైతులు కలిశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ వైయ‌స్‌ జగన్‌ భరోసా కల్పించారు. 

స‌ర్కార్ పొట్ట కొడుతోంది..
మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల‌ను ప్ర‌భుత్వం అవుట్ సోర్సింగ్ పేరుతో పొట్ట‌గొడుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బుధ‌వారం మున్సిప‌ల్ కార్మికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు.  ఎన్ని రకాల ఆందోళన చేసినా.. సర్కారు పట్టించుకోవడం లేదని మొరపెట్టుకున్నారు.  కార్మికుల బాధలు ఓపిగ్గా విన్న వైయ‌స్‌ జగన్.. అధికారంలోకి రాగానే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని భరోసా ఇచ్చారు.

ఎన్నిసార్లు అధికారుల‌కు మొర‌పెట్టుకున్నా..
త‌మ‌కు పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ఎన్నిసార్లు అధికారుల‌కు మొర‌పెట్టుకున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లువురు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. కుటుంబ పెద్దలిద్దరూ దివ్యాంగులే. అయినా పెన్షన్కు నోచుకోలేదు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో  కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో పడ్డామ‌ని వైయ‌స్ జగన్ కలిసి చెప్పాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన..స్వయంగా వారి వద్దకు వచ్చి కలిసి, సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము పడుతున్న బాధలను దివ్యాంగులు వివరించారు. అధికారంలోకి రాగానే....అండగా ఉంటానని వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు.

అధినేత వెంటే
అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని బుధవారం పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్‌ నేత వైయ‌స్‌ వివేకానందరెడ్డి తదితరులు కలిశారు. పలువురు నాయకులు జననేతతో కొంత దూరం పాదయాత్రలో నడిచి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Back to Top