రాష్ట్ర భవిష్యత్తు కోసం జననేత పోరాటం

కర్నూలుః తెలంగాణ సర్కార్  నిర్మించనున్న అక్రమ ప్రాజెక్ట్ ల వల్ల  రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాష అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని వైయస్ జగన్ ముందే చెప్పారని, అయినా వినకుండా  కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాయని మండిపడ్డారు. దాని ఫలితాన్నే ఇవాళ చూస్తున్నామన్నారు. టీడీపీ సర్కార్  కారణంగా రాయలసీమ భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న వైయస్ జగన్ జలదీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. 
Back to Top