ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ మీడియా...!

విశాఖపట్నంః విద్యార్థి యువభేరిలో డిజిటల్ మీడియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువభేరి సదస్సులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిటల్ మీడియాను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. విద్యార్థుల్లో  చైతన్యం తీసుకొచ్చేదిశగా డిజిటల్ మీడియా ఎంతో కృషిచేస్తుంది. ఈక్రమంలోనే యువభేరిలో  స్టాళ్లు ఏర్పాటుచేసి విద్యార్థులకు దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. వెబ్ సైట్ , ఈ-పేపర్, ఫేస్ బుక్, ట్విట్టర్ అన్నింటి వివరాలను ప్రింటింగ్ చేసి కార్డుల రూపంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎల్సీడీ ద్వారా  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పార్టీ సందేశాలు విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.   

నేటి తరాన్ని మేలుకొలిపే విధంగా డిజిటల్ మీడియాలో చక్కని సందేశాలు ఇస్తున్నారని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా  ప్రత్యేకహోదా తదితర విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని అన్నారు. వైఎస్ జగన్ వార్తావిశేషాలను తెలుసుకునేందుకు మేం డిజిటల్ మీడియాను రోజూ ఫాలో అవుతుంటామని యువభేరికి వచ్చిన విద్యార్థులు తెలిపారు. వైఎస్ జగన్ ప్రసంగాలు విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేవిధంగా ఎంతో  ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. సమస్యలపై పోరాడేందుకు డిజిటల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.  
Back to Top