బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

హైదరాబాద్ః రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ లు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ కండువాలు కప్పుతున్నారని  వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారని...టీడీపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని అంబటి రాంబాబు అన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షం గొంతు నొక్కుతూ చంద్రబాబు నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఫైరయ్యారు. బాబు అనైతిక చర్యలను, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని..తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

Back to Top