బాబును దేవుడు క్షమించడు

()బాబు పబ్లిసిటీ వల్లే పుష్కరాల్లో ఘోరాలు 
()విద్యార్థుల మృతికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
()ప్రతీ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలి
()పుష్కరాల పేరుతో బాబు రాజకీయం చేస్తున్నాడు
()వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్

కృష్ణా జిల్లాః పుష్కరాల పేరుతో రాజకీయాలు చేస్తూ చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు.  పుష్కరాల్లో విద్యార్థుల మృతికి చంద్రబాబు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. నాకింత, నాకొడుకుకు ఇంత అంటూ చంద్రబాబు  ఇసుకమాఫియాను ప్రోత్సహించడం వల్లే విద్యార్థులు చనిపోయారన్నారు. పుష్కరాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ....మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
 • పుష్కరస్నానానికి వెళ్లిన విద్యార్థులను ఈతకు వెళ్లి చనిపోయారని ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తోంది
 • ఏటూరు పుష్కర ఘాట్ కు ఇదే దారి అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలతో బొమ్మలు పెట్టారు.  మీడియాలో కూడా వచ్చింది. ఇన్ని వస్తావున్నప్పుడు ప్రభుత్వం ఏరకంగా చేతులు దులుపుకుంటుంది. 
 • ప్రభుత్వం ఎంత సిగ్గులేకుండా ప్రవర్తిస్తుందంటే....విద్యార్థులు ఈతకు వెళ్లి చనిపోయారని అబద్ధాలు చెబుతున్నారు. నేను వెళ్లి నగేష్ తల్లిని అడిగాను. ఆ తల్లి బాధపడుతూ నాకొడుకుకు ఈత రాదని చెప్పింది. 
 • పుష్కరస్నానం చేయకపోతే పాపం వస్తుందన్నట్లు ఫ్లెక్సీలు, ఫోటోలు పెట్టి బాబు విపరీతంగా పబ్లిసిటీ చేశారు. విద్యార్థులు స్నానం కోసం వెళ్లారు. కానీ అక్కడ యథేశ్చచగా ఇసుకను తవ్వేయడంతో గుంతలో పడిపోయారు. ఆపరిస్థితి ఎందుకు వచ్చింది. 
 • ముఖ్యమంత్రి హోదాలో ఉండి.... ఇసుకను నాకింత, నాకొడుకుకు, నాయకులకు ఇంత అంటూ విచ్చలవిడిగా దోపిడీ చేయడం వల్లే ఈఘోరం జరిగింది. 
 • సాక్ష్యాధారాలతో సహా రుజువవుతున్నా, ఇన్ని తప్పులు చేస్తూ కూడా  ప్రభుత్వం బాధ్యతగా తీసుకోకుండా స్విమ్మింగ్ చేస్తూ చనిపోయారని అబద్దాలు చెబితే ఆ తల్లులకు బాధ కలగదా.
 • గోదావరి పుష్కరాల్లో బాబు షూటింగ్ కోసం 29మంది చనిపోయారు. ఇవాళ బాబు చేసిన నిర్వాకం వల్ల విద్యార్థులు చనిపోయారు. 
 • చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సింది పోయి...జగన్ వస్తున్నాడని ఇవన్నీ మాట్లాడుతాడని మూడు లక్షలు ముష్టివేసినట్లుగా వేశారు. అది కూడా ఇవ్వలేదు. ఈ ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత. ప్రతీ కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి.  ఇవ్వకపోతే బాబును దేవుడు క్షమించడు. 
 • పబ్లిసిటీ కోసం పుష్కరాలను ఈవెంట్ గా మార్చి బాబు రాజకీయం చేస్తున్నాడు.
 • పూజలు, కార్యక్రమాలు చేయకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో  గుళ్లు, గోపురాలను సైతం నిర్దాక్షితంగా కూలదోస్తున్నాడు. చివరకు దేవుడి భూములను కూడా దోపిడీ చేశారు. వేయికోట్ల విలువ చేసే సదావర్తి సత్రం  భూములను అప్పనంగా బాబు తన బినామీలకు అమ్మేశాడు. ఆఖరికి పుష్కరాల్లో పిల్లలను చంపేసి పరిహారం ఇవ్వని పరిస్థితికి వచ్చాడు. 
 • దేవుడి సొమ్మును ముట్టుకోవడానికే భయపడతారు. అలాంటిది దేవుడి గుళ్లను కూల్చుతూ భూములను స్వాహా చేస్తున్నాడు. 
 • బాబు దేవుడిని  వెటకారం చేస్తున్న తీరును, అవినీతిని ప్రజలు, భగవంతుడు చూస్తున్నాడు. కచ్చితంగా బాబుకు మొట్టికాయలు వేసే రోజు వస్తుంది.  
 • బాబుమీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతున్నా. చనిపోయిన కుటుంబాలకు తోడుగా నిలబడితేనేరూ. 20 లక్షల పరిహారం వస్తుంది. మీడియా కూడా సహాయసహకారాలు అందించాలి.
 • శిశుపాలుడు వంద తప్పులు చేసినట్లుగా... బాబు చేస్తున్న మోసాలకు ఆదేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు. 

Back to Top