నంద్యాల ప్రజలంతా వైయస్సార్సీపీ వైపే

  • డబ్బులు, ప్రలోభాలతో టీడీపీ నీచ రాజకీయాలు
  • జగన్ కు వస్తున్న ప్రజాధారణ తట్టుకోలేక కుయుక్తులు
  • టీడీపీ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారు
  • నంద్యాల ప్రజలు వైయస్సార్సీపీని గెలిపించబోతున్నారు
  • వైయస్ జగన్ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు..లోకేష్ కృత్రిమ నాయకుడు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
నంద్యాలః స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటూ వైయస్ జగన్ అభిమానాన్ని చూరగొంటుంటే...అధికార టీడీపీ మాత్రం డబ్బులు పంపకాలు, ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలతో నీచ రాజకీయాలు చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.  జగన్ మీటింగ్ లకు పోవద్దని చెప్పి టీడీపీ నేతలు డబ్బులిచ్చి,  మందుబాటిళ్లు సప్లై చేసి టీడీపీ ఆఫీసు, ఇళ్లకు మనుషులను తరలించి గేట్లు వేస్తున్నారంటే చంద్రబాబు ఎంత నీచానికి దిగజారిపోయారో అర్థమవుతోంద్నారు. డబ్బులు, మందుబాటిళ్లు ఇచ్చి ప్రజలను బంధించాలని చూసినా గోడలు బద్దలు కొట్టుకొని జగన్ సభలకు వస్తున్నారని, అది వైయస్ జగన్ కు ఉన్న ప్రజాభిమానమని గడికోట అన్నారు. నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడికోట ఇంకా ఏమన్నారంటే....వైయస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని. ఈ ధర్మయుద్ధంలో అవినీతి పాలనకు నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పాలి. వైయస్సార్సీపీని గెలిపించాలి. 

నంద్యాలలో ప్రతి అక్కచెల్లెమ్మ అన్నయ్యను చూడాలి. రాఖీ కట్టాలని ఉత్సాహం చూపిస్తున్నారు. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి జగనే స్వయంగా వెళ్లి పలకరించి కష్టాలు తెలుసుకుంటున్నారు.  భవిష్యత్తులో నంద్యాలను ఎక్కడ లేనివిధంగా అభివృద్ధి చేస్తామని హామీనిస్తూ వారి అవసరాలు గమనిస్తూ తిరుగుతున్నారు. కానీ, అధికార టీడీపీ మాత్రం బురజల్లే కార్యక్రమాలు చేయడం, అవినీతి పనులు ప్రోత్సహించడం, దౌర్జన్యాలు, బంధించడంలాంటివి చేస్తుంది. ఈ ధర్మ పోరాటంలో ప్రజలు విజ్ఞతగా ఆలోచన చేస్తున్నారు. ఈ సమరంలో ప్రజలు జగన్ ను గెలిపిస్తున్నారని తెలిసి బాబు రాష్ట్ర నలుమూలలనుంచి డబ్బుసంచులు దించుతున్నారు. వాటిని వెదజల్లుతూ రాజకీయాలు చేస్తున్నారు. వైయస్ జగన్ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. లోకేష్ కృత్రిమంగా వచ్చినవాడు. అదీ ఇద్దరికీ తేడా. 

వ్యక్తిగతంగా బాలకృష్ణను కామెంట్ చేయాలన్న ఉద్దేశ్యం తమది కాదు. కానీ, బాలకృష్ణ  విజ్ఞత కోల్పోయి కార్యకర్తలను కొట్టడం, డబ్బులు పంచడం లాంటివి చేయడం దారుణం. టీడీపీ దౌర్జన్యాలు, డబ్బుల పంపకాలు, ప్రలోభాలను నంద్యాల ప్రజలు గమనిస్తున్నారు. వైయస్సార్సీపీని గెలిపించబోతున్నారు. బాబు గోబెల్స్ ప్రచారం మానుకోవాలి. శిల్పా పార్టీ మారారని బాలకృష్ణ చెబుతున్నారు. అవున ఆయన రాజీనామా చేసి వైయస్సార్సీపీలోకి వచ్చారు. కానీ,  మీ వెనుక ఉన్న మంత్రులకు అదే ప్రశ్న ఎందుకు వేయలేదు. ఓ పార్టీ తరపున గెలిచి టీడీపీలో మంత్రులైన వారిని బాలకృష్ణ తన పక్కనే ఉన్నాఎందుకు ప్రశ్నించలేదో ఆలోచన చేయాలి. మందులు, డబ్బులు, కూపన్ లు, టోకెన్ లతో  బాబు రాజకీయాలను దిగజార్చారు. ఒక్క మైనారిటీ ఎమ్మెల్యేను కూడ గెలిపించుకోలేని, క్యాబినెట్ లో మైనారిటీలకు అవకాశం ఇవ్వని నీవా మైనారిటీల గురించి మాట్లాడేది అంటూ చంద్రబాబుపై గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 

కాకినాడలో బీజేపీతో కలిసి పోటీచేస్తూ నంద్యాల మాత్రం జెండాలు పట్టుకొని తిరగవద్దని చంద్రబాబు మిత్రపక్ష నేతలకు చెప్పడం సిగ్గుచేటు. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలో వైయస్ జగన్ ను చూసి బాబు నేర్చుకోవాలి.  ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన బాబుకు భూమా కుటుంబం ఓ లెక్కనా...? అఖిలప్రియకు కనీస సమాచారం లేకుండా రాజకీయ అవసరాల కోసం బాబు ఆ కుటుంబంలో చిచ్చుపెట్టాడు.  అఖిలప్రియ ఇప్పడైనా ఆలోచన చేయాలి. మీరు వైయస్సార్సీపీలో ఉన్నప్పుడు మీ తల్లి, మీతండ్రికి జగన్ ఏవిధమైన ప్రాధాన్యత ఇచ్చారో తెలుసుకోవాలి. భవిష్యత్తులో మీకు ఏరకమైన అవమానాలు జరుగుతాయో మీకే తెలుస్తుంది. ఎవరినైనా వెన్నుపోటు పొడవడం, వాడుకోని వదిలేయడం బాబు నైజం. వైయస్ఆర్ ఉన్నన్ని రోజులు రాయలసీమ పాడిపంటలతో సశ్యశ్యామలంగా ఉండేది. బాబు ఏం చేశాడు. ఆగష్టు మాసం పూర్తి కావొస్తోంది.  చుక్కనీరిచ్చారా. క్యాబినెట్ ను నంద్యాలలో దించి జగన్ ను టార్గెట్ చేయడం బాబు నీచ రాజకీయాలకు నిదర్శనం.  ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమే తమకు తెలుసు. 
Back to Top