ప‌రిటాల రాజ‌కీయ‌ సన్యాసాన్ని ప్రజలే నిర్ణయిస్తారు

అనంతపురం : మ‌ంత్రి ప‌రిటాల సునీత రాజ‌కీయ స‌న్యాసాన్ని ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా ద్వారా నీళ్లివ్వడానికి అదనపు టెండర్లు అక్కర్లేదు...అని  తాము చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న‌ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్య‌ల‌పై తోపుదుర్తి స్పందించారు. ఈ మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మడకశిర లిఫ్ట్‌ కెనాల్‌ నుంచి మొదటి నాలుగు లిఫ్ట్‌లను అదనంగా 30 రోజుల పాటు పంపింగ్‌ చేసి, మడకశిర బ్రాంచ్‌ కాలువ 26వ కిలోమీటర్‌ వద్దనున్న తురకలాపట్నం వంకకు నీళ్లొదొలితే దిగవున 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నానదిలోకి నేరుగా వెళ్తాయని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ఒకరోజులోనే పేరూరు డ్యాంకు వెళ్తాయన్నారు. ఈ విషయం గతంలో కూడా తాము పదేపదే చెప్పామన్నారు. ఇరిగేషన్‌ ని«ఫుణులు, ప్రస్తుత అధికారులు కూడా అనధికారింకగా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారన్నారు. రైతు కరువును సాకుగా చూపించి ఇరిగేషన్‌ టెండర్ల ద్వారా ప్రభుత్వం చేస్తున్న దోపిడీని మొన్న చెన్నేకొత్తపల్లిలో జరిగిన రైతు పోరుబాటలో ప్రస్తావించామన్నారు. మంత్రి సునీతా... మిమ్మల్ని శంకరగిరి మాణ్యాలు పట్టించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 25 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ఉన్నా...ఏనాడూ పేరూరు డ్యాం గురించి ప్రస్తావించలేదన్నారు. తాము రాజకీయాల్లోకి వచ్చి హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు నీళ్లివాలంటూ ఉద్యమాలు చేస్తుంటే అప్పుడు పేరూరు డ్యాం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. పేరూరు డ్యాం, హంద్రీ–నీవా గురించి కనీసం ఉచ్చరించే అర్హత కూడా సునీతకు లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హంద్రీ–నీవా టెండర్లలో పర్సెంటేజీలు తీసుకున్న ఘనత మీదే అని విమ‌ర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top