ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంటే

నంద్యాల: చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికొదిలేసి కొన్ని వేలమంది ఇంటలిజెన్స్‌ అధికారులను నంద్యాలలో వేశారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా చంద్రబాబుకు గుణపాఠం చెబుతారన్నారు. స్థానికంగా ఏ నాయకుడు బలంగా ఉన్నారో వారిని కొనుగోలు చేసేందుకు ఇంటలిజెన్స్‌ అధికారులు పనిచేస్తున్నారని, వ్యవస్థనే భ్రష్టుపట్టించే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబుపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగితే వైయస్‌ఆర్‌ సీపీకి భారీ మెజార్టీ వస్తుందన్నారు. 

Back to Top