వైయస్‌ జగన్‌ సీఎం కావాలని అందరు కోరుకుంటున్నారు - ఎమ్మెల్యే జగ్గిరెడ్డితూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  మా తండ్రి ఇచ్చిన ఆస్తి మీరే అన్నారు. వైయస్‌ జగన్‌ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యానని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులను చంద్రబాబు ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని, చంద్రబాబు సీఎం అయితే లోకేష్‌ ఒక్కరికే ఉపయోగమన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మొన్న కృష్ణా బ్యారేజీ కదిలిందని, నిన్న గోదావరి బ్రిడ్జి ఊగిందన్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తునే ఉన్నామన్నారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, మన సమస్యలు తీరబోతున్నాయని చెప్పారు. అరటి రైతులు, పచ్చడి కార్మికులు, పూత రేకుల తయారీదారుల సమస్యలు వైయస్‌ జగన్‌ తెలుసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర మన నియోజకవర్గంలో 40 కిలోమీటర్లు సాగిందన్నారు. 
Back to Top