ప్రత్యేకహోదాపై ప్రజావాణి

హోదా మనకు అవసరం
ప్రత్యే హోదా అనేది మన రాష్ట్రానికి చాలా అవసరం. ప్రత్యేక హోదా కోసం ప్రతీ ఒక్కరూ గొంతు కలపల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా దారుణంగా నష్టపోయాం. రాష్ట్రానికి పరిశ్రములు, పెద్ద సంఖ్యలో రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఏకైక మార్గం ప్రత్యేక హోదా. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదు.
– పాటి వీరధనరాజ్, తొండవరం.

జీవన ప్రమాణలు మెరుగుపడతాయి
ప్రత్యేక హోతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రత్యేక హోదా సంజీవిని వంటింది. రాష్ట్ర భవిష్యత్‌ బంగారమవుతుంది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. పరిశ్రమలు స్థాపించడం ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవుతుంది.
– కొర్లపాటి వెంకటేశ్వరరావు, అంబాజీపేట,

కేంద్రం కాళ్లపై పడ్డారు
హోదా వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆశించాం. ప్రజా ప్రయోజనాలకన్నా స్వప్రయోజనాలకే టీడీపీ నేతలు ఎక్కువ విలువ ఇచ్చారు. కాబట్టే నేడు కేంద్రానికి సాగిలాపడ్డరు. హోదా కావాలని చెప్పిన పాలకులు నేడు ప్యాకేజీతో సరిపెట్టుకుని యువత ఉపాధిపై నీళ్లు జల్లారు.
– జనుపల్లి ఏడుకొండలు, వక్కలంక

Back to Top