వైయస్ జగన్ తో పయనించండి

నంద్యాలః చంద్రబాబు మోసానికి కాదేది అనర్హం అనే రీతిలో మహిళలు,నిరుద్యోగులు, రైతులు అందరినీ మోసం చేశాడని వైయస్సార్సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. చంద్రబాబు బీసీలను అడుగడుగునా వంచిస్తున్నాడని అన్నారు. రజక, నాయి బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లపై అర్థరాత్రి దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ, వాల్మీకిల ఆత్మీయ సదస్సు పెట్టి టీడీపీ సదస్సుగా మార్చాడని రామయ్య బాబుపై విమర్శలు గుప్పించారు. బీసీ సబ్ ప్లాన్ కు 10వేల కోట్లు ఇస్తామన్నా హామీ ఏమైందని ప్రశ్నించారు. బాబు మాటలకు, చేతలకు పొంతన లేదని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి బాబు ఆనందిస్తున్నారని రామయ్య మండిపడ్డారు.  మాల, మాదిగలకు..పులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టాడని బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తో పయనించాలని రామయ్య నంద్యాల ప్రజలకు సూచించారు. మోసపోయే పరిస్థితి ఉండదని,  మాట ఇస్తే తప్పని వ్యక్తి జగన్ అన్న సంగతి గుర్తెరగాలన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు వైయస్ జగన్ చిత్థశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు.

Back to Top