జ‌న జాత‌ర‌




- వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తుల వెల్లువ‌
- అనంత‌పురం రూర‌ల్ మండ‌లంలో బ్ర‌హ్మ‌ర‌థం


అనంత‌పురం: ప‌్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుని, వారికి తోడుగా ఉండేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అనంత‌పురం జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఇవాళ 34వ రోజు అనంత‌పురం రూర‌ల్ మండ‌లంలో పాపంపేట బైపాస్ నుంచి ప్రారంభ‌మైంది. జిల్లాలో 8వరోజు మంగళవారం చిన్నంపల్లి క్రాస్‌ నుంచి మొదలైంది. దారిపొడవునా మహిళలు హారతిపట్టి దిష్టితీశారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు. అడుగడుగునా జన తాకిడి పెరుగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ప్ర‌జ‌లు ప‌నులు మానుకొని ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కూడా జ‌న జాత‌ర క‌నిపిస్తోంది. జ‌నం క‌ష్టాలు ఓపిక‌గా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ వారి క‌న్నీళ్లు తుడుస్తూ ముందుకు వెళ్తున్నారు. నేనున్నాన‌ని హామీ ఇస్తున్నారు. దారిపొడువునా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలు వైయ‌స్‌ జగన్‌ను కలిసి సీపీఎస్‌ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిండికేట్‌నగర్‌ వాసులు వచ్చి చేనేత సమస్యలు చెప్పారు. తర్వాత కెనాడా నుంచి వచ్చిన ఫణిభూషన్‌ అనే ఎన్‌ఆర్‌ఐ యాత్రకు సంఘీభావం తెలిపారు. కురుకుంట వైయ‌స్ఆర్‌ కాలనీ వాసులు వైయ‌స్ జగన్‌ను కలిసి,  వైయ‌స్‌ హయాంలో కాలనీ నిర్మించారనే కారణంతో డ్రైనేజీ, సీసీరోడ్లు, మంచినీటి సమస్యలాంటి మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని  చెప్పారు. తర్వాత పారామెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలిసి పర్మినెంట్‌ చేసేలా అసెంబ్లీలో ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు.

చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెబుతాం: మ‌హిళ‌లు
ప‌దేళ్లుగా డ్వాక్రా సంఘంలో ఉన్నామ‌ని, ఈ నాలుగేళ్ల‌లో తీవ్ర ఇబ్బందులు, అవ‌మానాలు ఎదుర‌య్యాయ‌ని రూర‌ల్ మండ‌లంలోని మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చి మోసం చేసిన చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెబుతామ‌ని మ‌హిళ‌లు హెచ్చ‌రించారు. మ‌రికొంత మంది రుణ‌మాఫీ లేదు, పింఛ‌న్లు అంద‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. త‌మ‌కు తాగేందుక నీరు లేద‌ని రుద్రంపేట మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విన‌తి
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు క‌లిశారు. టీడీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ప్ర‌తిప‌క్ష నేత‌కు ఫిర్యాదు చేశారు. వీరి స‌మ‌స్య‌లు సానుకూలంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇలా దారిపొడవునా ప్రజలు సమస్యలు చెప్పారు.  

తాజా వీడియోలు

Back to Top