రెట్టింపు ఉత్సాహం- వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
- విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- సాలూరు నుంచి పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
విజ‌య‌న‌గ‌రం:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌ రెడ్డి మొక్కవోని దీక్షతో మళ్లీ జనం మధ్యకు వచ్చారు. జ‌న‌నేత‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం నుంచి మంగ‌ళ‌వారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభించ‌గా మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గంలోకి పాద‌యాత్ర ప్ర‌వేశించింది.  గత నెల 25న మక్కువ మండలంలో  పాదయాత్రను ముగించుకుని  హైదరాబాద్‌కు బయలుదేరిన జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన విషయం విధితమే. గాయం పూర్తిస్థాయిలో నయంకాకపోగా.. వైద్యులు మరింత విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ప్రజల కష్టాలను తెలుసుకోవాలనే వజ్ర  సంకల్పంతోనే  ప్రతిపక్ష నేత  తన పాదయాత్రను నిన్న‌టి నుంచి పునఃప్రారంభించారు.   భగవంతుని దీవెనలు, ప్రజల ఆశీస్సులతో పాదయాత్రను చేస్తోన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతున్నారన్నారు. ఏ గ్రామానికి వెల్లినా అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పింఛన్లు, ఇళ్లు, భూ సమస్యలను జననేత దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. జగన్‌ సీఎం అయితే వైయ‌స్ఆర్  సంక్షేమ పాలన మళ్లీ అందుతుందని భావిస్తున్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం తరువాత రెండో రోజు పాదయాత్రలో ప్రజలు, మహిళలు యువత రెట్టింపు ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు అవ‌రోధాల‌ను త‌ప్పించుకుని ముందుకు వ‌చ్చారు. స్థానికంగా నెలకొన్న  సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్తున్నారు. 

296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముఖ్యాంశాలు ఇలా.. 

– విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని కొయ్యానపేట శివారులోని శిబిరం నుంచి పాద‌యాత్ర ప్రారంభం.
– శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.
– పాదయాత్ర ప్రారంభంలో వైయస్‌ జగన్‌ను కలిసిన కొయ్యానపేట మహిళలు. పలు సమస్యలపై మొర. ఏళ్ల తరబడి అవి పరిష్కారం కావడం లేదని ఆవేదన. పింఛన్లు, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదని, చివరకు రేషన్‌ కార్డులు కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించిన కొయ్యానపేట మహిళలు. ఇంకా అంగన్‌వాడీ కేంద్రానికి గ్రామంలో సొంత భవనం లేక 30 మంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు.
– ఆ తర్వాత యాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసిన తూరుమామిడి గ్రామస్తులు. ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో ఉన్న తమ ఊరికి సరైన రహదారి లేదని, రోడ్డు నిర్మాణం కోసం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని తూరుమామిడి వాసుల ఆవేదన. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో విద్యార్థులు అనివార్యంగా సైకిళ్లపై వెళ్లాల్సి వస్తోందని, దీంతో వారి చదువులు సక్రమంగా సాగడం లేదని విపక్షనేతకు ఫిర్యాదు చేసిన తూరుమామిడి వాసులు. ఇంకా స్త్రీ నిధి డబ్బులు కూడా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆక్షేపించిన గ్రామస్తులు.
– మరోవైపు మక్కువ జూనియర్‌ కళాశాల విద్యార్థినిల భేటీ. కళాశాలలో ఎలాంటి సదుపాయాలు లేవని, కూర్చోవడానికి బెంచిలు కూడా లేకపోవడంతో కింద కూర్చుని చదువుకుంటున్నామని జననేతకు వివరించిన విద్యార్థినులు. కళాశాలకు ప్రహరీ కూడా లేకపోవడంతో ఆకతాయిలకు కేంద్రంగా మారిందని విపక్షనేత వద్ద తమ బాధలు చెప్పుకున్న విద్యార్థినిలు. జననేత సీఎం అయితేనే తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని విద్యార్థినిల స్పష్టీకరణ.
– ఆ తర్వాత కంచేడువలస మీదుగా వెంకటభైరిపురం చేరుకున్న పాదయాత్ర. రాజన్న బిడ్డకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. పెద్ద సంఖ్యలో బారులు తీరిన మహిళలు, విద్యార్థులు. జననేత రాకతో గ్రామంలో అంతులేని సందడి.
– గ్రామంలో జననేతను కలిసిన వెంకటభైరిపురం వాసులు. వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలువలకు గండ్లు పడడంతో నీరందడం లేదని తెలిపిన గ్రామ రైతులు. మరోవైపు ప్రాజెక్టులో పూడికతీత పనులు కూడా చేపట్టాలని కోరిన రైతులు. ఇంకా వెంకటభైరిపురం, శిర్లాంతో పాటు మరో మూడు గ్రామాల్లో పశు వైద్యశాలలు లేక ఇబ్బంది పడుతున్నామని విపక్షనేతకు వివరించిన రైతులు. 
– బాబు వస్తే జాబు వస్తుందంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత తమను మోసం చేశాడని పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి ఆక్షేపించిన నిరుద్యోగులు. పార్టీ అధికారంలోకి రాగానే తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పణ.
– భగ్గందొరవలస శివారులో పార్వతీపురం నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్‌. జననేతకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త అలజంగి జోగారావుతో పాటు, పలువురు నేతలు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. నీరాజనం పలికిన మహిళలు.
– భగ్గందొరవలసలో  వైయస్‌ జగన్‌ను కలిసిన మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సి.రామచంద్రయ్య. జననేత సమక్షంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రామచంద్రయ్య. మరోవైపు వైయ‌స్ఆర్‌  జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ నేత ఎన్‌.సుబ్బరాఘవరాజు కూడా జననేతతో భేటీ. పార్టీలో చేరిక. ఇరువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైయస్‌ జగన్‌.
– భగ్గందొరవలసలో పాదయాత్ర అనంతరం శివారులోని శిబిరం వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగిన జననేత.
– ఇక దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు. 
–  వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఇంకా ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన మహిళలు, విద్యార్థులు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top