అడుగ‌డుగునా ఆప్యాయ‌త‌..ప్రేమానురాగాలు



- వైయ‌స్ జ‌గ‌న్‌పై అభిమాన జడివాన..
- పూత రేకులు తినిపిస్తూ..మామిడి మాండ్ర రుచి చూపిస్తున్న కోన‌సీమ వాసులు
-  తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
 తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌పై తూర్పు గోదావ‌రి జిల్లా వాసులు అడుగ‌డుగునా ఆప్యాయ‌త‌లు పంచుతున్నారు. ప్రేమానురాగాలు చూపుతున్నారు. త‌మ కోసం ఇంత దూరం వ‌చ్చాడ‌ని మురిసిపోతున్నారు. బాధ‌లు చెప్పుకొని స్వాంత‌న పొందుతున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భించింది. ఆయా  గ్రామాల్లోని ప్రజలు రహదారిపై పూలు చల్లి తమ నేతను నడిపించి అభిమానాన్ని చాటుకుంటున్నారు. పేరవరంలో అభిమానులు వరికంకులతో తయారు చేసిన గుచ్ఛాన్ని అందజేశారు. పేరవరం గ్రామానికి చెందిన మంగా దివ్య అనే బాలిక.. జననేతకు బొబ్బట్లు తినిపించి అభిమానాన్ని చాటుకుంది. పుచ్చకాయల కిషోర్‌–శిరీష దంపతులు తమ కుమార్తెకు వైయ‌స్‌ జగన్‌తో నామకరణం చేయించుకున్నారు. ఆ చిట్టితల్లికి జన నేత వైయ‌స్ జగన్‌ ‘విజయమ్మ’ అని నామకరణం చేశారు. వెలిచేరులో అభిమానులు వైయ‌స్‌ జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వద్దిపర్రు క్రాస్‌ వద్ద రైతులు నాగలిని బహూకరించి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆత్రేయపురంలో వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కచెల్లెమ్మలు హారతులిచ్చి దిష్టి తీశారు. జననేతను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. సెంటర్‌లో అక్కచెల్లెమ్మలు వైయ‌స్‌ జగన్‌కు పూతరేకులు తినిపించగా.. ఆయన బాగుందని కితాబిచ్చారు. పూతరేకుల తయారీ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పేరవరం నుంచి లొల్ల లాకుల వరకు బొబ్బర్లంకకు చెందిన దళితులు తమ నావలపై వైయ‌స్ఆర్‌ , వైయ‌స్‌ జగన్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నవరత్నాల పథకాల కటౌట్లతో మధ్య డెల్టా కాలువ నుంచి యాత్రను అనుకరించారు. ఓ పక్క మధ్య డెల్టా కాలువ, మరోపక్క పచ్చని అరటి, కొబ్బరి తోటల మధ్య కాలువ గట్టుపై ప్రజా  సంకల్పయాత్ర ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.

అన్నకి బొబ్బట్లు ఇచ్చాను   – రావిపాటి మంగాదివ్య, పేరవరం
తూర్పుగోదావరి : పేరవరం గ్రామానికి చెందిన రావిపాటి మంగా దివ్యకు మాటలు రావు. తన ఊరిలోకి అన్న వస్తున్నాడని తెలిసిన నాటి నుంచి తన అభిమానాన్ని చాటుకోవాలకుంది. ఇంటిలో బొబ్బట్లు తయారు చేయించి, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామంలోకి రాగానే బొబ్బట్లు అందజేసింది. అనంతరం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్టు మంగా దివ్య తన సైగల ద్వారా తెలియజెప్పింది.

- నేను పూతరేకుల తయారీ షాపులో పనిచేస్తున్నాను. జగనన్న అంటే మాకు ప్రాణం. నా సోదరి అపర్ణకు చిన్నప్పటి నుంచి మాటలు రావు, వినపడదు. రావులపాలెంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. జగనన్న ప్రజాసంకల్ప పాదయాత్రలో మా ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకుని ఎలాగైనా కలవాలని ఇద్దరం నిశ్చయించుకున్నాం. వైయ‌స్ జగన్‌ను కలవడమే కాకుండా పూతరేకులు కూడా తినిపించామని ఆత్రేయపురం మండలం వసంతపూడికి చెందిన మాగాపు నాగదేవి సంతోషంగా తెలిపింది.

-  వైయ‌స్ జగనన్నకు తాము తయారు చేసిన పూతరేకులు తినిపించడం ఆనందంగా ఉంది. పాదయాత్రలో భాగంగా ఆత్రేయపురం వచ్చిన వైయ‌స్ జగన్‌ను నా కుటుంబ సభ్యులతో పాటు కలుసుకుని పూతరేకులు తినిపించానని ఆత్రేయపురానికి చెందిన చెన్నం కనకదుర్గ తెలిపింది.

తాజా వీడియోలు

Back to Top