పట్టు సడలని ధృడ సంకల్పం - ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- రాజ‌న్న బిడ్డ‌కు అడ‌గ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
కృష్ణా జిల్లా:  నాలుగేళ్లుగా పాల‌కుల నిర్ల‌క్ష్యానికి గురైన అభాగ్యుల‌కు నేనున్నాన‌ని పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టు స‌డ‌ల‌ని ధృడ సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది.  వేల కిలోమీటర్లు నడుస్తున్నా..లక్షల అడుగులు వేస్తున్నా...చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. అవ్వాతాతల మోములో నవ్వులు చూడాలని అక్కాచెల్లెళ్ల బతుకుల్లో ఆనందం వెల్లివిరియాలని అన్నాతమ్ముళ్ల లోగిళ్లలో వెలుగు పూలు పూయాలని అన్నదాతల ఇళ్లు పాడిపంటలతో తులతూగాలనికార్మికుల కుటుంబాలు సంతోషాలతో తొణికిసలాడాలనిపల్లెలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు కావాలనిపట్టణాలు ప్రగతి రథ చక్రాల్లా పరుగుతీయాలనిఅంతటా అభివృద్ధి కాంతులు పరచుకునిరేపటి స్వర్ణ యుగానికి మేలిమలుపు కావాలని..రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు..

దారుల‌న్నీ జ‌న‌సంద్రం
వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని ప్ర‌జ‌లు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు.  ఊళ్లన్నీ ఒక్కటిగాజనమంతా కలసికట్టుగాజగమంత కుటుంబంలాఎదురేగి ప‌ల‌క‌రిస్తున్నారు. ఒకే శ్వాస...ఒకటే ధ్యాస జననేత సంకల్పం నెరవేరాలని యోధుడికి సైదోడు నిలవాలనిమనస్ఫూర్తిగా మనస్సాక్షిగాపయనిస్తూ  ప్రణమిల్లుతూవిజయోస్తు అని దీవిస్తూ ప్రజాసంకల్పయాత్రకుసారథులవుతున్నారుజన వారధులుగా నిలుస్తున్నారు..153వ రోజు శనివారం మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్ధాలపాలెం నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి బంటుమిల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి వైయ‌స్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అక్కడి నుంచి తోటమాల తర్వాత పెడన చేరుకుంటారు. పెడన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొంకెపూడి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు దారిపొడవునా వై.య‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. వారంద‌రికి రాజ‌న్న బిడ్డ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. 
Back to Top