పుల‌కించిన స్వ‌ర్ణ‌పురి

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పోటెత్తిన జ‌నం
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గుంటూరు జిల్లాలో ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న మొద‌లైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. నిన్న‌టికి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 1500 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకొని తన ముంగిట్లోకి అడుగుపెట్టిన జననేతకు స్వ‌ర్ణ‌పురి ప్ర‌జ‌లు బ్రహ్మరథం పట్టారు. దారుల‌న్నీ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర వైపే అన్న‌ట్లుగా పాద‌యాత్ర సాగుతోంది. వేలాది మందితో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముందుకు సాగుతోంది. ఎర్న‌టి ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. గురువారం ఉదయం వైయ‌స్ జ‌గ‌న్ 113వ రోజు పాద‌యాత్ర‌ను పొన్నూరు శివారు నుంచి  ప్రారంభించారు. అక్కడ నుంచి కనుకర్రు చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయ‌స్‌ జగన్‌ వల్లభరావుపాలెం చేరుకుంటారు. ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ 1,508.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

పోటెత్తిన పొన్నూరు
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పొన్నూరు ప‌ట్ట‌ణానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసేందుకు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు.  అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చిన జనంతో పొన్నూరు రోడ్లన్నీ కిటకిట లాడాయి. పట్టణంలోని ఐలాండ్‌ సెం టర్‌లో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా రైతుల సమస్యలను ప్రస్తావించారు. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రైతన్న వద్ద సరుకు ఉన్నప్పుడు ధర తగ్గిస్తారని, పంట దళారుల వద్దకు చేరగానే రేటు పెరుగుతోందని పేర్కొన్నారు. దళారులకు సీఎం నేతృత్వం వహిస్తున్నారని విమర్శించారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందడంలేదని ఆందో ళన వ్యక్తంచేశారు. పొన్నూరులో గృహనిర్మాణానికి సంబంధించి అవినీతి కుంభకోణం చోటు చేసుకుం దని, పట్టణంలో ఇప్పటికీ తాగునీటి సరఫరా దారుణంగా ఉందని పేర్కొన్నారు. 70 శాతానికి పైగా గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దివంగత మహానేత హయాంలో కృష్ణా, గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారని గుర్తు చేశారు.
Back to Top