భ‌రోసా యాత్ర‌


- ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-  గాడిపర్తివారిపాలెం శివారు నుంచి 102వ రోజు పాద‌యాత్ర ప్రారంభం
- ఇవాళ ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- సాయంత్రం తాళ్లూరులో  బహిరంగ సభ 
ప్రకాశం : వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం శివారు నుంచి 102వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అక్కడ నుంచి జననేత వైయ‌స్‌ జగన్‌ దర్శి మండలంలోకి ప్రవేశిస్తారు. శివరాంపురం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.  భోజ‌న విరామం అనంత‌రం కొర్రపాటి వారి పాలెం క్రాస్‌ మీదుగా తాళ్లూరు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు జననేత 1,370.8 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

దారి పొడ‌వునా స‌మ‌స్య‌ల వెల్లువ‌
ప్రజాసంకల్ప యాత్రలో దారి పొడ‌వునా ప్ర‌జ‌లు త‌మ  సమస్యలు ఏకరువు పెడుతున్నారు. రంద్ర‌బాబు పాల‌న‌లో నాలుగేళ్లుగా పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి వందల మైళ్లు దాటి నడచివస్తుంటే జననేతకు  పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతించి మమతల హారతిపడుతున్నాయి. పేద బతుకుల్లో సంతోషం చూడాలని పరితపిస్తున్నవైయ‌స్‌ జగన్‌ ‘సంకల్పం’ నెరవేరాలని కోరుకుంటున్నాయి.మేము సైతం అని జనం అడుగులో అడుగేస్తున్నారు.  జనానికి తానున్ననంటూ వైయ‌స్‌ జగన్‌ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. మీ అందరీ ఆశీర్వదంతో మనందరి ప్రభుత్వం వస్తూనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని హామీ ఇస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌కు తానున్నాన‌ని భ‌రోసా ఇస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.
Back to Top