అలుపెర‌గ‌ని న‌డ‌క‌..జ‌న‌మంతా వెనుక‌- అడుగడుగునా వైయ‌స్‌ జగన్‌కు నీరాజనం
- దారిపొడువునా స‌మ‌స్య ల వెల్లువ 
నెల్లూరు: ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు.. అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలిన సర్కారు తీరును నిలదీసేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో పూర్తి అయి ఈ నెల 23న నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. అలుపెర‌గ‌ని పాద‌యాత్రికుడికి ప్ర‌జ‌లు అండ‌దండ‌లు అందిస్తున్నారు. అన్నా..మీ వెనుకే ఉంటామంటూ ఉప్పెన‌లా క‌దులుతున్నారు.  గురువారం నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లైంది.  అడుగడుగునా ప్రజలు జ‌న‌నేత‌కు బ్రహ్మరథం పట్టారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా మేము సైతం అంటూ వైయ‌స్ జగన్‌వెంట అడుగులు వేశారు. తమ సమస్యలను, వేదనను వెళ్లబోసుకుంటున్నారు. ఎటు చూసినా జనమే. ఓ వైపు యువత కోలాహలం.. మరోవైపు పెద్దల ఎదురుచూపులు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు  అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా జననేతకు ఎదురేగి కష్టాలు చెప్పుకున్నారు. పలుచోట్ల కుల, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెల్లువలా వినతిపత్రాలు సమర్పించారు. అశేష జనవాహిని అపూర్వ స్వాగతాల నడుమ 71వ రోజు ప్రజాసంకల్ప యాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో కొన‌సాగుతోంది.  వేలాది మంది జ‌న‌నేత అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అన్నా..మీ వెంటే మేము అంటూ భ‌రోసా క‌ల్పించేందుకు వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌కు భ‌రోసాగా నిలుస్తున్నారు. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల్లో వీధుల్లో, భవనాలపై కిక్కిరిసిన జనసందోహాన్ని చూసిన జగనన్న ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకుసాగుతున్నారు. గ్రామాల్లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఎక్క‌డిక్క‌డ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతున్నారు.  ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే రాజకీయాల్లో మార్పు రావాల‌ని,  ప్రజలంతా తనను ఆదరించి దీవించాలని ఆయ‌న కోరుతున్నారు.  

స‌మ‌స్య‌లు ఏక‌రువు..
ప్రస్తుత పాలనలో ఎన్ని అగచాట్లు పడుతున్నారో జనం కన్నీటి పర్యంతమవుతూ వైయ‌స్ జగన్‌కు చెప్పుకుంటున్నారు. జిల్లాలో వందలాది మంది నిరుద్యోగులు ఆయనను కలిశారు. ‘ఎంటెక్, ఎంబీఏ లాంటి పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు లేవన్నా..’ అంటూ ఏకరువు పెట్టారు.  విద్యుత్‌ కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కలిశారు. కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతోందన్నారు. జన నేత చలించిపోయారు. మనందరి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న కార్మికులను క్రమ పద్ధతిలో క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈ ఒక్క భరోసా అనేక మందికి ధైర్యాన్నిచ్చింది. మద్యం మహమ్మారితో చితికిపోయిన కుటుంబాల గోడుకు పరిష్కారం చూపించే దిశగా.. అధికారంలోకి వస్తూనే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. నిజంగా తమకిది శుభవార్తే అని మహిళలు అంటున్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఆయా సామాజిక వ‌ర్గాలు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకొని సాంత్వ‌న పొందుతున్నారు. 

Back to Top