పల్లె పల్లెలో ఆత్మీయత



- వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌గ్రామాన ఘ‌న స్వాగ‌తం
- పోటెత్తుతున్న దారులు
చిత్తూరు:  ప్ర‌జా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర నేటికి మూడు నెల‌లు కావొస్తుంది. వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర నిర్వ‌హించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది.   రెండు నెల‌ల పాటు పాదయాత్ర చేస్తున్న అలుపెరగని బాటసారికి ప‌ల్లె ప‌ల్లెలో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ‌నివారం చిత్తూరు జిల్లా గొడ్లవారిపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి శ్రీనివాసపురం, చాల్లవారిపల్లి మీదగా కల్లూరు వరకూ  వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ఈ సంద‌ర్భంగా కల్లూరులో మైనార్టీల ఆత్మీయ సదస్సులో వైయ‌స్‌ జగన్ పాల్గొని వారికి భ‌రోసా క‌ల్పించారు. అశేషంగా వచ్చిన జనంతో క‌ల్లూరు జనసంద్రాన్ని తలపించింది. ప్ర‌తి ఒక్క‌రిని ఆప్యాయంగా పలకరిస్తూ ..వయసుకు గౌరవమిస్తూ..బాధితులకు భరోసానిచ్చారు. జననేతలో తొణికిసలాడే ఆ వ్యక్తిత్వమే సామాన్యుడికి గురి పెంచుతోంది. ఆ భావనే కష్టాన్ని  చెప్పుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఓపిగ్గా జననేత వింటున్న తీరు విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. అందుకే వైయ‌స్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర రోజురోజుకూ జన హృదయాలకు దగ్గరవుతోంది. పల్లె పల్లెకూ ఆత్మీయతను పంచుతోంది. తమ కష్టాలను తీర్చే పెద్ద బిడ్డ వచ్చిన అనుభూతి జనంలో ప్రస్ఫుటమవుతోంది. నాలుగేళ్లుగా పడుతున్న యాతనను జ‌న‌నేత‌కు వివరించి సాంత్వన చేకూరిన మనసుతో వెనుదిరుగుతున్నారు.
Back to Top