జగనన్న వెంటే మా పయణం

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు అన్న వెంటే
చిత్తూరు: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైయస్‌ జగన్‌ వెంట నడిచేందుకు దివ్యాంగులు సైతం నడుంబిగించారు. జగనన్న సీఎం అయితేనే మా బతుకులు బాగుపడతాయని వారు కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు దివ్యాంగులు (అందులో ఒక మహిళా) వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగస్వాములయ్యారు. జగనన్న వెంట చివరి వరకు వస్తామని చెబుతున్నారు. మహిళలమ్మ ఇబ్బందులు పడతావని చెప్పినా ఆ దివ్యాంగురాలు వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతుంది. 
అన్న సీఎం కావాలని ఆశ..
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే మా లాంటి వారి బతుకులు బాగుపడతాయి. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే అన్న కూడా అలాంటి పాలన అందిస్తారని నమ్మకం. జగనన్నను కలిసి మేము కూడా మీతో పాటు నడుస్తామన్న పాదయాత్రలో అంటే వద్దమ్మా ఇబ్బందులు పడతావు మహిళవు కదా అని చెప్పారు. కానీ నాకు వెనక్కు వెళ్లాలనిపించలేదు. జగనన్నకు తోడుకు చివరి వరకు నడుస్తా.. 
బీటెక్‌ చదివి రోడ్డుమీద సిమ్‌కార్డులు అమ్ముతున్నా..
బీటెక్‌ చదివి రోడ్డు మీద సిమ్‌కార్డులు అమ్ముకుంటున్నా.. మాకు జీవనోపాధి కష్టంగా ఉంది. గతంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం దివ్యాంగులకు 5 ట్రైసైకిళ్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా బతుకులు మారాలంటే జగనన్న సీఎం కావాలి. అన్న సీఎం కావాలనే ఆశతో పాదయాత్రలో పాల్గొంటున్నా.. ఇచ్ఛాపురం వరకు అన్నతో ఉంటా. మా సమస్యలన్నీ జగనన్నకు చెప్పుకున్నాం. దివ్యాంగుల ఇబ్బందులు తీర్చడమే కాకుండా మూడు చక్రాల మోటర్‌ సైకిళ్లు కూడా ఇస్తానన్నారు. 
 
Back to Top