మీరే మా కొండంత అండ

- అనంత‌పురం జిల్లాలో దిగ్విజ‌యంగా  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 
- క‌ష్టాలు వింటూ..క‌న్నీళ్లు తుడుస్తున్న జ‌న‌నేత‌
 
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు తాము టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొంటున్న అన్యాయాలను ఆయనకు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. వారికి భరోసా ఇస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. నవంబర్‌ 6వ తేదీ వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లా మీదుగా ఈ నెల 4న అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత చేపట్టిన పాదయాత్ర నేడు 35వ రోజుకి చేరుకుంది. గురువారం ఉదయం రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి పాదయాత్ర  ప్రారంభమైంది. జనం తండోపతండాలుగా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అన్నా..మీరే మా అండ..దండా అంటూ అక్కున చేర్చుకుంటున్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి దూరం కావడం మా దురదృష్టమని, ఆయన కన్న కలలను మీరే సాకారం చేయాలని వేడుకుంటున్నారు. 

రాజన్న బిడ్డకు రాప్తాడులో బ్రహ్మరథం

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిన్న రుద్రంపేట బైపాస్‌ శివార్ల నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలైంది. జననేతకు కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరిని వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. రుద్రంపేట బైపాస్‌కు చేరుకోగానే రుద్రంపేట, తపోవనం, నారాయణపురం, కొట్టల వాసులు ఖాళీబిందెలతో వచ్చారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడం లేదని, నాలుగేళ్లుగా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంజనాదేవి, తులశమ్మ, లక్ష్మీదేవితో పాటు డ్వాక్రా మహిళలు వచ్చి రుణాలు చెల్లించలేదంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా శిబిరాన్ని వైయస్‌ జగన్‌ సందర్శించారు. వారి సమస్యలు విని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి ప్రసన్నాయపల్లికి చేరుకున్నారు. చర్చి ఫాదర్లు వైయస్‌ జగన్‌ను కలిసి ప్రత్యేక ప్రార్థనలతో ఆశీర్వదించారు. గంగులకుంటలో జగన్‌కు మహిళలు దిష్టితీసి హారతిపట్టారు. 

20 ఏళ్లుగా అన్యాయం

హెచ్ ఎల్ బిసి సిస్టంలో ఉన్న పీఏబీఆర్‌ కుడికాలువ కింద ఉన్న ప్రాంతాలకు 20 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వైయస్‌ జగన్‌ దుష్టికి తెచ్చారు. అప్పట్లో హంద్రీ–నీవాకు ఎగువన ఆత్మకూరు లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా ఆత్మకూరు మండలంలోని 12 వేల ఎకరాలకు నీళ్లిస్తామని టెండర్లు కూడా పిలిచారని గుర్తుచేశారు. 3వ ప్యాకేజీ కింద 16 వేల ఎకరాలు, 4వ ప్యాకేజీ కింద 2,800 ఎకరాలు, 5వ ప్యాకేజీ కింద 24 వేలు, 7వ ప్యాకేజీ కింద 12 వేల ఎకరాలు మొత్తంగా 76 వేల ఎకరాలకు నీరు తెచ్చుకునే హక్కు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి పరిటాల సునీతకు ఆ హక్కును కాలరాసే అధికారం ఎక్కడుందని ప్రశ్నించారు. నియోజకవర్గ రైతుల కష్టాలను చూసి 2009లోనే మహానేత వైయస్‌ఆర్‌ రూ.119 కోట్లతో పేరూరు ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలని తలచారని గుర్తుచేశారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తానని, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. జననేత హామీతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 


Back to Top