అదే ఆప్యాయ‌త‌..అదే స్ఫూర్తి


- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
- ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
ఒంగోలు:  నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో విసిరి వేశార‌ని ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పేందుకు, వారి క‌ష్ట‌న‌ష్టాల్లో పాలు పంచుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయ‌లో ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. దారి పొడువునా ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాల‌ను రాజ‌న్న బిడ్డ‌కు చెప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు,అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి కాగా, వేలాది మంది అడుగులో అడుగు వేస్తూ అన్నా..నీవే మాకు దిక్కు అంటూ, కాబోయే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్ర‌జా సంకల్ప యాత్రలో భాగంగా  89వ రోజు ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  పాద‌యాత్ర ప్రారంభం నుంచి ఇవాల్టి వ ర‌కు ప్ర‌జ‌లు రాజ‌న్న బిడ్డ‌పై అదే ఆప్యాయ‌త‌, అదే ప్రేమానురాగాలు, అదే స్ఫూర్తి ప్ర‌ద‌ర్శిస్తూ అడుగులో అడుగేస్తున్నారు. జ‌న‌నేత ఏ ఊరికి వెళ్లినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అన్నొస్తున్నాడ‌ని ప‌నులు మానుకొని ఎదురెళ్లి మ‌రి స్వాగ‌తం ప‌లికి, త‌మ క‌ష్టాలు చెప్పుకుంటున్నారు. ఇవాళ ఉద‌యం ప్ర‌కాశం జిల్లా నూక‌వ‌రం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.   అత్తింటివారిపాలెం, బ‌డేవారిపాలెం , బొంత‌వారిపాలెం, కాక‌టూరు,చేర్లోప‌ల్లి, ప్ర‌శాంతి న‌గ‌ర్ మీదుగా కందుకూరు వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతోంది. 

స‌మ‌స్య‌ల వెల్లువ‌
వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎవ‌రిని ప‌ల‌క‌రించిన త‌మ స‌మ‌స్య‌ల గోడు వినిపిస్తున్నారు. అధికార పార్టీ పింఛన్లు తొలగించిన వారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు మొదలు వివిధ వర్గాల వారు వైయ‌స్‌ జగన్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు తొలగించిందంటూ పలువురు మహిళలు వైయ‌స్ జగన్‌ వద్ద వాపోగా దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి నెలకొల్పిన ఆరోగ్యశ్రీని నిర్యీర్యం చేసి పేదలకు ఉపయోగపడకుండా చేశారని పలువురు ఆయ‌న దృష్టికి తెస్తున్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకపోగా నిరుద్యోగ భృతి సైతం ఇవ్వలేదంటూ పలువురు వాపోయారు. కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని పలువురు వైయ‌స్ జగన్‌ దృష్టికి తెస్తున్నారు. ఇవాళ ఉద‌యం న్యాయ‌వాదులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంద‌జేశారు.  


Back to Top