ఉక్కు దీక్షకు అనూహ్య మద్దతు

వైయ‌స్ఆర్ జిల్లా: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 48 గంటల దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తుంది. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతలు, రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాచమల్లు స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదు. స్టీల్‌ ప్లాంట్‌ గురించి నాలుగేళ్లు మాట్లాడకుండా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఉక్కురాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు. 
Back to Top