టీడీపీ పాలనలో ప్రజల అవస్థలు

టీడీపీ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బాబు నియంత, నిర్లక్ష్యపు పాలనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా...చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా ప్రజాసమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు. దీనికి తోడు  వర్షాభావ పరిస్థితులు, కరువు, తాగునీటి ఎద్దడితో ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే..పాలకులు మొద్దు నిద్ర వహిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో బాబు ఘోరంగా విఫలమయ్యారు. గొంతెండుతోంది దప్పిక తీర్చండి మహోప్రభో అని ప్రజలు నెత్తినోరు మొత్తుకుంటున్నా...అధికార పార్టీ నేతల చెవికి ఎక్కడం లేదు.

Back to Top