కాళ్లు ప‌ట్టుకుంటే పెన్ష‌న్ ఇస్తార‌ట‌

వెంకటగిరిరూరల్ః వితంతువు పెన్ష‌న్ ఇవ్వ‌మ‌ని కోరితే మీరు వేరే పార్టీకి చెందిన వారు కాబ‌ట్టి కుటుంబ స‌భ్యులంతా వ‌చ్చి మా కాళ్లు ప‌ట్టుకుంటే ఇస్తామ‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దుర్మార్గంగా మాట్లాడుతున్నార‌ని ...వెంక‌ట‌గిరి మండ‌లం క‌ల‌పాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు గిన్నేరి న‌ర‌స‌మ్మ జెడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డితో వాపోయింది. మండలంలోని కలపాడు గ్రామంలో రాఘ‌వేంద్ర‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని గ్రామ‌స్తులు వాపోయారు. తమ గ్రామంలో పింఛన్‌ అర్హత కలిగిన 15 మంది ఉన్నామని ఒక్కరికి కూడా టీడీపీ నాయకులు పింఛన్‌ మంజూరు చేయడం లేదని వాపోయారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, సోమసానిగుంట సర్పంచ్‌ తిరుమల, నాయకులు కందాటి రాజారెడ్డి, రాజేష్, బూత్‌కమిటీ కన్వీనర్‌ చెంగళరాయులు పాల్గొన్నారు.

Back to Top