తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలు

నెల్లూరుః తాగునీటి కోసం ప్ర‌జ‌లు అల్లాడుతున్నా ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ అనిల్‌కుమార్ యాద‌వ్ అన్నారు. నీటి స‌మ‌స్య‌పై నెల్లూరు మున్సిప‌ల్ కమిష‌న‌ర్‌ను ఎమ్మెల్యే అనిల్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వేస‌వికాలంలో ఎండ వేడికి త‌ట్టుకోలేక పోతున్నార‌ని, దానికి తోడు తాగునీటి స‌మ‌స్య‌ ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా వేధిస్తుంద‌న్నారు. వ‌డ‌దెబ్బ త‌గిలి ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నా ప్ర‌భుత్వం మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌న్నారు. క‌నీసం మున్సిప‌ల్ అధికారులైన చొర‌వ తీసుకొని ప్ర‌జ‌ల‌ను తాగునీటి స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట‌ర్లు, నాయ‌కులు, కార్య‌కర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top