అవినీతి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

టెక్కలి: అవినీతి పాలన కొనసాగిస్తున్న టిడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రజలకు పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం తమ సొంత ఖజానాలు నింపుకోవడానికి టిడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారని ఆమె ఆరోపించారు. పేద, సామాన్య వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారిని హింసించే పనిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని రెడ్డి శాంతి మండిపడ్డారు. గడచిన మూడున్నర సంవత్సరాల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఇసుక, మద్యం మాఫియాలతో అవినీతికి పాల్పడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేవలం మూగ జీవిగా మారి జిల్లా ప్రజల ఆశలను కొల్లగొట్టారని రెడ్డి శాంతి అన్నారు. వైయస్సార్‌ సీపీ అధినేత  జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలో నిర్వహించిన గడప గడపకూ వైయస్సార్, నవరత్నాల ప్రచారంతో ప్రజలతో పాటు కార్యకర్తల్లో నూతనోత్తేజం చోటు చేసుకుందని ఆమె తెలిపారు.  టిడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పై గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాల్సిన భాధ్యత కార్యకర్తలపై ఉందని ఆమె కోరారు. 

అనంతరం నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌ మాట్లాడుతూ... యువనేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రంలో సువర్ణ పాలన అందజేసే భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో వైయస్సార్‌ సీపీ లో వివిధ విభాగాల్లో పదవులు అందుకున్న నియోజకవర్గ స్థాయి నాయకులకు రెడ్డి శాంతి ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ పటిష్టత కోసం అహిర్నశలు శ్రమించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై.చక్రవర్తి, జిల్లా కార్యదర్శి డి.వెంకట్రావు, సంతబొమ్మాళి పార్టీ మండల అధ్యక్షుడు బుడ్డ మోహన్‌రెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు మార్పు నాగభూషణరావు, యువజన అధ్యక్షుడు చింతాడ దిలీప్, జిల్లా మహిళా విభాగం ప్రతినిధి వై.ప్రభావతి, నీలకంఠం, బి.మోహన్, గురివినాయుడు, చింతాడ రామారావు, అప్పలనాయుడు, బి.జగ్గారావు, తుంబయ్య, భాస్కరరెడ్డి, గడ్డెన్న, మల్లేష్, సింహాచలం, శ్రీరామ్ముర్తి, ఆనందరావు, లింగరాజు, సత్తారు సత్యం, టి.జానకిరామయ్య, చింతాడ గణపతి, చిన్ని జోగారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top