ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి

నెల్లూరు: పట్టణంలోని జాకీర్‌హుస్సేన్‌ నగర్‌లోని శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవస్థాన కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ ఓబిలి రవిచంద్ర, నాయకులు పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, నంద ఆశ్వత్ధామ, బూదవరపు బాలాజీ, సంక్రాంతి కళ్యాణ్, కడిమ హరికృష్ణ, బాలా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top