బాబు చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలి

  • మైనార్టీలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి
  • కాపుల గొంతు కోసి ఓట్లు అడగడానికి సిగ్గులేదా..?
  • వంగవీటి రంగాను చంపిన వ్యక్తికి ఓట్లు వేస్తారా..?
  • భూమా నాగిరెడ్డి చావుకు కారణం చంద్రబాబే
  • వెన్నుపోటుకు, విశ్వసనీయతకు మధ్య నంద్యాలలో పోరు
  • ప్రజలంతా వైయస్‌ జగన్‌ పక్షాన నిలబడి ధర్మాన్ని గెలిపించాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
నంద్యాల: ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు మైనార్టీ సోదరులంతా చెంప చెల్లు మనిపించేలా తీర్పు ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ కోరారు. మైనార్టీలంటే చులకన భావం ప్రదర్శిస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు ఈ ఎన్నికలు ఒక ఆయుధమన్నారు. ముస్లిం మత పెద్దలంతా ఏకతాటిపైకి వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. నంద్యాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా.. ముస్లింల స్థితిగతులు మార్చాలని 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలో గెలిచిన మైనార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను కేబినెట్‌లో విస్తరణలో చోటు కల్పిస్తానని మైనార్టీలకు మోసం చేసిన చంద్రబాబుకు ఒత్తాసు పలుకుతారా.. లేక వైయస్‌ఆర్‌ తనయుడు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు ముద్దతు ఇస్తారో ఆలోచించుకోవాలన్నారు. 

చంద్రబాబు కాపు వ్యతిరేకి
కాపుల గొంతు కోసిన చంద్రబాబు వారిని ఓటు అడిగేందుకు సిగ్గుపడాలని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమా చంద్రబాబు కాపు వ్యతిరేకి అని, గొంతు కోశారని మాట్లాడిన మాట వాస్తవం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. బలిజ సోదరులంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. వంగవీటి మోహనరంగా సత్యగ్రహం చేస్తుంటే విజయవాడ నడిబొడ్డున కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపిన వ్యక్తికి కాపులంతా ఓట్లు వేస్తారా.. అని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తానని మోసం చేశాడన్నారు. కాపులను, బలిజలను అంటరానివాళ్లుగా చేసి ముద్రగడ పద్మనాభంనుం గృహ నిర్భందం చేసి ఉద్యమాన్ని అణచివేశారని మండిపడ్డారు. కాపులంతా నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేసి బాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. 

ఓడిపోతానని నంద్యాల వీధుల్లో ఏడుస్తున్న సీఎం
అవనిగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య చనిపోతే వైయస్‌ జగన్‌ నిండు మనస్సుతో టీడీపీకి వదిలేశారన్నారు. నందిగామలో తంగిరామ ప్రభాకర్, తిరుపతిలో వెంకటరమణ చనిపోతే వైయస్‌ జగన్‌ పోటీ పెట్టకుండా ఆ సీట్లను టీడీపీకే ఇచ్చేశారన్నారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి చనిపోతే పోటీ ఎందుకుపెడుతున్నారని బాబు ప్రశ్నించారు. నంద్యాల నుంచి గెలిచిన భూమాను ప్రలోభాలు పెట్టి దొడ్డి దారిన తన పార్టీలోకి తీసుకెళ్లిన చంద్రబాబు ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వకుండా క్షోభ పెట్టి గుండెపోటుతో మరణించేలా చేశారన్నారు. భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారణమని జోగి రమేష్‌ విమర్శించారు. నంద్యాల వైయస్‌ఆర్‌ సీపీదేనని తెలుసుకున్న చంద్రబాబు వీధుల్లోకి వచ్చి ఏడవడం మొదలు పెట్టాడని జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. వెన్నుపోటు చంద్రబాబుకు, విశ్వసనీయత గల వైయస్‌ జగన్‌కు జరుగుతున్న పోటీల్లో ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ తరుపున నిలబడి దుశ్యాసనుడు లాంటి బాబుకు బుద్ధి చెప్పాలన్నారు. అసెంబ్లీలో భూమా నాగిరెడ్డిని ఫ్యాక్షనిస్టు అని తిట్టిన కాల్వ శ్రీనివాసులు నంద్యాలకు వచ్చి భూమా కుటుంబానికి ఓటు వేయాలని కోరుతున్నాడని, ఇటువంటి దుర్మార్గలంతా నంద్యాల వీధుల్లోని బురదల్లో పొర్లాడుతున్నారని, వీరికి తగిన బుద్ధి చెప్పి తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. 
Back to Top