- ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ..సమస్యలు తెలుసుకుంటున్న జననేత- కర్నూలు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన
కర్నూలు: ప‌్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ద్వారా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జనం హరతులు పడుతున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ..అదిగో రాజన్న బిడ్డ అంటూ ఎదురెళ్లి అప్యాయంగా పలకరిస్తున్నారు. తమ బాధలు తీర్చే నాథుడు లేడని, మీరే మాకు అండ..దండా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఈ నెల 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అలుపు, సొలుపు లేకుండా జననేత ప్రజల మధ్య అడుగులు వేస్తూ వారి కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్న పిల్లలను పలకరించుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా అదే ఆప్యాయత..అదే ఆత్మీయత రాజన్న బిడ్డపై కనబరుస్తున్నారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నిన్న కోడుమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి వైయస్ జగన్ పాదయాత్ర అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే దారిపోడువునా జననేతకు తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజలు మరోమారు మహానేత పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యామని, మీరే ఆదుకోవాలని జనం వేడుకుంటున్నారు. జననేతను చూసి ‘జగనన్నా.. జగనన్నా’ అంటూ యువత కేకలు వేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం వైయస్ జగన్‌తో కలిసి అడుగులో అడుగులు వేస్తున్నారు. ఆ చిట్టి పొట్టి పిల్లల కబుర్లు వింటూ, చిరునవ్వుతో వారి చేతుల్లో చిక్కిన తన చేయిని అలాగే ఉంచేసి వైయస్ జగన్ కొంత దూరం అడుగులు వేస్తున్నారు. బాగున్నావా అన్నా, తమ్ముడు, అక్కా..చెల్లి, అమ్మా, అవ్వ, తాత అంటూ తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తున్నారు.పలువురు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని వైయస్ జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి బాసటగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తామని వైయస్ జగన్ భరోసానిచ్చారు.