టీడీపీకి ఓట్లు వేసి మోసపోయాం– మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం
– మోసపోయామని వైయస్‌ జగన్‌ ఎదుట మొర 

అనంతపురం: వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌  పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 33వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. వైయస్‌ జగన్‌ ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి ఓట్లు వేసి మోసపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరే మాకు దిక్కు అంటూ వైయస్‌ జగన్‌ ఎదుట తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. పింఛన్లు అందడం లేదని వృద్ధులు, వితంతువులు, ఫీజులు రావడం లేదని విద్యార్థులు, వేధింపులు భరించలేకపోతున్నామని ఉద్యోగులు, రుణాలు మాఫీ కాలేదని రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగ భద్రత లేదని కాంట్రాక్టు కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ను దారిపోడువునా కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీత ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని స్థానికులు ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

టీడీపీ పాలనలో ఉద్యోగాలు లేవు
అనంతపురం:  టీడీపీ పాలనలో ఉద్యోగాలు లేవని అనంతపురం జిల్లా యువకులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రను విజయవంతం చేస్తామని, ఎవరు అడ్డువచ్చినా పాదయాత్ర ఆగదని పేర్కొన్నారు.  జగన్‌ కోసం ఎందాకైనా నడుస్తామని యూత్‌ పేర్కొన్నారు. చంద్రబాబు నిరుద్యోగులను దగా చేశారని స్థానిక యువకులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.  జిల్లాలో ఉపాధి, ఉద్యోగాలు లేకపోవడంతో బెంగూళురుకు వలస వెళ్తున్నామన్నారు. పరిశ్రమల గురించి మభ్యపెడుతున్నారని, ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని తెలిపారు. ఈ నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ఉన్నా ఎలాంటి అభివృద్ధి లేదని యువత తెలిపారు. నారా లోకేష్‌వచ్చి రాని ఇంగ్లీష్‌ మాట్లాడుతూ యువతను కన్యూS్ఫజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

రుణాలు మాఫీ కాలేదు:
పంట రుణాలు మాఫీ కాలేదని రాప్తాడు నియోజకవర్గ ప్రజలు వైయస్‌ జగన్‌కు తెలిపారు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేసి మోసపోయామని వాపోయారు. నాలుగేళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదని, అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టాలు మూటకట్టుకుంటున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్‌ గన్స్‌పేరుతో కరువును పారద్రోలామని ప్రగల్భాలు పలకడం తప్ప, చేసింది ఏమీ లేదన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌అందడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 
 
Back to Top