చిన్నారికి అక్ష‌రాభ్యాసంపశ్చిమగోదావరి  :  కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన  దంపతుల త‌మ‌ కుమార్తెకు అదే ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అక్ష‌రాభ్యాసం చేయించారు. దీంతో ఆ దంపతులు మురిసిపోయారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక చ‌దువుల విప్ల‌వం తీసుకువ‌స్తామ‌న్నారు. చిన్న బిడ్డ‌ల‌ను ఏ స్కూల్‌కు పంపించినా స‌రే ఆ త‌ల్లి ఖాతాలో ప్ర‌తి ఏటా రూ.15 వేలు  అంద‌జేస్తామ‌న్నారు. విద్యార్థుల‌కు హాస్ట‌ల్ ఖ‌ర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు చెల్లిస్తామ‌ని, మీ బిడ్డ‌ల‌ను ఏం చ‌దివిస్తారో చ‌దివించండి..ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చైనా భ‌రిస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
Back to Top