గుండెల్ని బరువెక్కించే కన్నీటి వినతులు

ఎండల్ని వెక్కిరించే ప్రజల ఎదురుచూపులు
జననేతకు సమస్యలు చెప్పుకుంటున్న ప్రజానీకం
పశ్చిమగోదావరి: ఎండల్ని వెక్కిరించే ఎదురుచూపులు.. గుండెల్ని బరువెక్కించే కన్నీటి వినతులు.. రాజన్న బిడ్డను కళ్లారు చేసి తమ సమస్యను చెప్పుకుందామని ప్రజలు తండోపతండాలుగా కదులుతున్నారు. దారి పొడవునా.. ప్రజల సమస్యలు వింటూ జననేత గుండె బరువెక్కుతుంది. ప్రజా సంకల్పం సాక్షిగా ప్రజల సమస్యలు కడతేర్చేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు... లక్షల అడుగుల తోడుగా ముందుకు సాగుతోంది. జననేత ఇచ్చే ధైర్యం ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 167వ రోజు ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలు జననేతకు అడుగడుగునా.. నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా పలువురు దళితులు వైయస్‌ జగన్ను పాదయాత్రలో కలుసుకున్నారు.. నాయన కట్టించిన ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నాం.. పెద్దాయన (వైయస్‌ రాజశేఖరరెడ్డి) ఉన్నప్పుడే దలితులకు ఇంటి లోన్లు వచ్చాయి.. ఇప్పుడు ఇవ్వమంటే.. మీరెవరూ అంటూ అధికారులు, పాలకులు గెంటేస్తున్నారు. స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇస్తామన్నారు.. కార్లు కూడా ఇస్తామన్నారు.. పేర్లు రాయించుకొని వెళ్లారు.. కార్లు ఎక్కడ సామీ అని అడిగితే.. ఇచ్చాం కదా అని చెబుతున్నారు.. తీరా చూస్తే పేర్లు మావి.. కార్లు తీసుకుందేమో టీడీపీ నేతలు.. ఇదెక్కడి న్యాయం జగనన్నా.. మాకు మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రజా సంకల్పయాత్రకు మిమ్మల్ని కలుసుకుందామని వస్తుంటే టీడీపీ నాయకులు దార్లు అడ్డుకుంటున్నారని వైయస్‌ జగన్‌తో వారి సమస్యలు వెల్లబోసుకున్నారు. 

అదే విధంగా కొందరు లంబాడీలు వైయస్‌ జగన్‌ను కలిసి.. అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం.. ఇంటిపై బిల్లులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు.. మా వాడకు దారులు లేవు.. అడవుల్లో ఉంటున్నాం. పిల్లలకు ఆధార్‌ కార్డులు ఇవ్వమంటే పోమ్మంటున్నారు. కాలనీల్లో సమస్యలతో సతమతమవుతున్నాం.. ఇన్ని సమస్యలతో ఎట్లా బతికేదని లాంబాడీ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. అన్ని వర్గాల ప్రజలది ఇవే బాధలు.. ఇంకెన్నో కష్టాలు. అందరి సమస్యలను ఓపిగ్గా వింటూ.. వాటికి పరిష్కారాలు చూపుతూ.. జననేత ముందుకు సాగుతున్నారు. 
 
Back to Top