పండగలా వైయస్‌ జగన్‌ పాదయాత్రవిశాఖ‌: ప‌్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకొని, వారితో మ‌మేక‌మ‌వుతూ..వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక ఎలాంటి ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌నే వివ‌రించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ జిల్లాలో పండ‌గ‌లా సాగుతోంది. ప్ర‌స్తుతం వైయస్‌ జగన్ పాద‌యాత్ర విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. అడుగ‌డుగునా జ‌న‌నేత‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఎదురెళ్లి హార‌తి ఇచ్చి ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. దారి పొడ‌వునా జ‌గ‌న‌న్న వ‌చ్చాడ‌ని క‌లిసి తమ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ఆత్మీయ నేత వ‌చ్చాడ‌ని రాఖీలు క‌ట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు.  వైయస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో  కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ అంటూ  నామకరణం చేయించుకుంటున్నారు. మరి కొందరు తమ పిల్లలకు వైయస్‌ జగన్‌తో అక్షరాభాస్యం చేయించుకున్నారు. వైయస్‌ జగన్‌ రాక కోసం ఎదురుచూస్తున్నామని  నేడు రాజ‌న్న బిడ్డ‌తో తమ పాపకు అక్షరాభాస్యం కార్యక్రమం చేయించామ‌ని త‌ల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు. వైయ‌స్‌ జగన్‌తో అక్షరాభాస్యం చేయిస్తే తమ పాప భవిష్యత్‌ బాగుంటుందని  తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వైయ‌స్‌ జగన్‌ మా పాపతో అక్షరాలు దిద్దించడం మాకెంతో సంతోషంగా ఉంద‌ని మురిసిపోతున్నారు. ఇంత‌కంటే మాకు పెద్ద పండ‌గ లేద‌ని చెబుతున్నారు. 
Back to Top