అభిమాన సంద్రం- దిగ్విజ‌యంగా సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం
- బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
- ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని పాద‌యాత్ర‌
- సాయంత్రం కాక‌మానులో రైతు స‌మ్మేళ‌నం
 గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లు దేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మాకోసం వ‌చ్చావా అంటూ ఆత్మీయ స్వాగతం ప‌లుకుతున్నారు. పాద‌యాత్ర దారుల‌న్నీ జ‌న‌సంద్ర‌మ‌వుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా ఎదురెళ్లి ప్ర‌జ‌లు రాజ‌న్న బిడ్డ‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ, అడుగులో అడుగులు వేస్తున్నారు. 2017 నవంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పూర్తి అయి ఈ నెల 12న గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఇవాళ  ఉదయం వైయ‌స్‌ వల్లభరావుపురం శివారు నుంచి 114వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి  పెద్దపాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం మీదుగా గరికపాడుకు చేరుకుంటారు. అనంతరం బీకే పాలెం మీదుగా కాకుమాన  వరకు పాదయాత్ర కొనసాగనుంది.తెల‌గాయ‌పాలెం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి పూర్ల‌కుంభంతో స్వాగతం ప‌లికారు. వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో తెల‌గాయ‌పాలెం జ‌న‌సంద్ర‌మైంది. సాయంత్రం కాక‌మాను వ‌ద్ద ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు.

చంద్ర బాబు పాలనలో అన్నీ కష్టాలే ..
చంద్ర బాబు నాలుగేళ్ల పాలనలో అన్నీ కష్టాలే అని, అన్ని విధాలుగా నష్టపోయామని రైతులు ఆవేద‌న చెందుతున్నారు.  ఏ పంటకూ గిట్టు బాటు ధర లేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇలాగైతే తామెలా బతకాలని పలువురు రైతులు, రైతు కూలీలు ఏపీ ప్రతిపక్ష నేత ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు.  మీరు సీఎం అయితేనే తమ బతుకులు బాగుపడతాయంటున్నారు. దారిపొడవునా రైతులు, ఉద్యోగులు, కూలీలు, వివిధ సంఘాల నేతలు ఆయనకు కష్టాలు చెప్పుకుంటున్నారు.  త‌న‌ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top