అనంత క‌ష్టాలు..అన్నొస్తేనే మేలు- నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క‌రికి మేలు చేయ‌ని చంద్ర‌బాబు
- దారి పొడువునా బాధ‌లు వింటూ..క‌న్నీళ్లు తుడుస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌
- నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క‌రికి మేలు చేయ‌ని చంద్ర‌బాబు
- ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం:  రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమ ప‌థ‌కాలు ప‌చ్చ చొక్కాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. అన్ని వ‌ర్గాల‌కే మేలు చేసే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌కు టీడీపీ స‌ర్కార్ తూట్లు పొడుస్తోంది. క‌నీసం గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు క‌రువ‌య్యాయి. తాగేందుకు నీరు లేదు. సాగుకు నీరంద‌డం లేదు. రాష్ట్ర విభ‌జ‌న‌తో క‌ష్టాల్లో ఉన్నప్ర‌జ‌ల‌ను గ‌ట్టెక్కిస్తార‌ని తొమ్మిదేళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు న‌మ్మి ఓట్లు వేస్తే..ఆయ‌న త‌న వెన్నుపోటు బుద్ధి పోనివ్వ‌లేదు. పిల్ల‌నిచ్చిన మామ‌కే వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబుకు ఓట్లు వేసిన ప్ర‌జ‌లు ఓ లెక్కా అన్న‌ట్లుగా మారింది. వ‌రుస నాలుగేళ్లు క‌రువుతో అల్లాడుతున్న అనంత‌పురం జిల్లా వాసుల క‌ష్టాలు వ‌ర్ణ‌ణాతీతం. ఊర్లో ఉపాధి లేక మూట‌, ముల్లే స‌ర్దుకొని ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వెళ్తున్నారు. ఒక‌ప్పుడు ప‌ది మందికి అన్నం పెట్టిన అన్న‌దాత‌కు ఒక‌పూట కూడా క‌డుపు నిండ‌టం క‌ష్టంగా మారింది. ప్ర‌జ‌ల చేత ఎన్న‌కోబ‌డిన స‌ర్పంచ్‌, ఎంపీటీసీలు సైతం గ్రామాల్లో బ‌త‌క‌డం క‌ష్టంగా మారింది. మ‌న ప్ర‌జా ప్ర‌తినిధులు ఇత‌ర రాష్ట్రాల్లో వాచ్‌మ‌న్లుగా, స్వీప‌ర్లుగా ప‌ని చేస్తున్నారంటే ఎంత దుర్భ‌ర ప‌రిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్ర‌బాబు రుణమాఫీ హామీని నమ్మి అప్పులపాలయ్యామని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, అన్నదాతలు.. వైయ‌స్ఆర్‌ సీపీ అభిమానివంటూ పింఛన్‌ తొలగించారయ్యా.. అంటూ దివ్యాంగులు, అవ్వ తాతలు.. రెండు కిడ్నీలు పాడయిపోయి వైద్యం కోసం ఆస్పత్రికెళితే లక్షలాది రూపాయలు అడుగుతున్నారయ్యా అంటూ నిరుపేదలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జననేత వారి కన్నీళ్లు తుడుస్తూ.. మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి జరుగుతుందని ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభించిన‌ ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 4న అనంత‌పురం జిల్లాలోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 35 రోజులు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేశారు. 483 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ల‌క్ష‌లాది మందిని క‌లిశారు. వేలాదిగా స‌మ‌స్య‌లు త‌న దృష్టికి వ‌చ్చాయి. గ్రామ గ్రామాన ప్ర‌తిప‌క్ష నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన జ‌నం ఆ త‌రువాత త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. 

వైయ‌స్ జ‌గ‌న్ రాక కోసం జ‌నం ఎదురు చూపులు
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ గ్రామానికి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌స్తున్నార‌ని స‌మాచారం తెలుసుకున్న జ‌నం ప‌నులు మానుకుని ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఏ గ్రామానికి వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మహిళలైతే ఉదయం 5 గంటల నుంచే ఇళ్ల ముందు కళ్లాపి చల్లి, ముగ్గులేశారు.. బంతిపూలు పరుస్తున్నారు. హ‌ర‌తులు ప‌డుతున్నారు. తికం దిద్దుతున్నారు. రాఖీలు క‌డుతున్నారు. స్వీట్లు, కూల్ డ్రింక్స్ వైయ‌స్ జ‌గ‌న్‌కు ఇచ్చి మురిసిపోతున్నారు.  చుట్టుపక్కల పల్లెల నుంచి జ‌నం స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి జ‌న‌నేత‌తో కలిసి నడుస్తున్నారు. పాదయాత్ర సాగే మార్గంలో యువకులు గోడలు, చెట్లపైకెక్కి ఎదురు చూస్తున్నారు. 

ఎంతైనా రాజన్న బిడ్డ కదా .. 
వైయ‌స్ జగన్‌ స్పందిస్తున్న తీరు.. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడటం.. బాగున్నారా అక్కా.. అవ్వా.. అన్నా.. అంటూ పలకరిస్తుండటం చూసి జనం దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్  రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. ఎంతైనా రాజన్న బిడ్డ కదా అంటూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని సమస్యలను పార్టీ నేతల ద్వారా అక్కడికక్కడే పరిష్కరిస్తుండటాన్ని జనం అభినందిస్తున్నారు. జగనన్నను కలిసి నా బాధ చెప్పాను.. రేపు సీఎం అయ్యాక తప్పకుండా మంచి జరుగుతుంది.. అంటూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ధరణి వైయ‌స్ జగన్‌ను కలిశాక తన బంధువులతో చెప్పింది. ఆమె తమ్ముడు మహేశ్‌ కూడా ఇదే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక తమలాంటి వారికి మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి అప్పులపాలయ్యామని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు లక్ష్మీదేవి, రామలక్ష్మి, ప్రవల్లిక, గంగారత్నం వైయ‌స్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కిడ్నీలు పాడైపోయిన వెంకట్రాయుడు వైయ‌స్ జగన్‌ను కలిశాడు. ‘అయ్యా.. ఏ ఆస్పత్రికెళ్లినా ఏడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారయ్యా.. ’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.  వీరి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌ట్టండి..మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే మా క‌ష్టాలు తీరుతాయ‌ని అనంత‌పురం జిల్లా వాసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 
Back to Top