పెండింగ్‌ వేతనాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి

అనంతపురం: పెండింగ్‌ వేతనాలు ఇప్పించాలని శ్రీ రామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం కార్మికులు ఎమ్మెల్యేను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. పెండింగ్‌ వేతనాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వేతనాల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Back to Top