చంద్రబాబు సైకోనో.. కాదో ప్రజలకే తెలుసు

హైదరాబాద్: శాసనసభలో విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఛార్జీల పెంపుపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార పక్ష సభ్యులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 'చంద్రబాబు సైకోనో...నేను సైకోనో మీ మనస్సాక్షిని అడిగండి. మీ గుండెలపై చేతులు వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకే అర్థం అవుతుంది. ఎవరు కళ్లు పెద్ద పెద్దవి చేసుకుని భయపెడతారో అందరికీ తెలుసు' అన్నారు.
Back to Top