బాబూ.. ప్రజలు డ్రైనేజీ నీరు తాగుతున్నారు

పశ్చిమ గోదావరి: డ్రైనేజీ నీరు తాగుతున్నామని పెంకులపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాగడానికి మంచినీరు లేవని, గ్రామస్తులు తాగే నీటిని ఓ బాటిల్‌లో తీసుకువచ్చి జననేతకు చూపించింది. ఈ మేరకు వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అయ్యా.. చంద్రబాబు నాయుడు బాటిల్‌లో ఉన్నది చెరుకు రసం కాదు.. గ్రామస్తులు తాగేనీరు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా అందించలేరా..? అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలుషిత నీరు తాగుతున్నామని ఇప్పటికే అనేక మంది మహిళలు వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 
Back to Top